బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 జులై 2023 (09:53 IST)

ర‌వితేజ త‌మ్ముడి కొడుకు మాధ‌వ్‌ హీరోగా Mr ఇడియ‌ట్‌

Raviteja, Madhav,  Gauri Ronanki, Simran Sharma
Raviteja, Madhav, Gauri Ronanki, Simran Sharma
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రానికి ‘Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌,  ప్రీ లుక్‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ ఆవిష్క‌రించారు.

నా కెరీర్‌లో ‘ఇడియ‌ట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మా ర‌ఘు కొడుకు మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నాలాగే త‌న‌కు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అని టీమ్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు ర‌వితేజ‌.
 
చిత్ర నిర్మాత నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ ‘‘మాస్ మహారాజా రవితేజగారి చేతుల మీదుగా మా ‘Mr ఇడియ‌ట్‌’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌, ప్రీ లుక్ లాంచ్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. ర‌వితేజ‌గారు ఇడియ‌ట్‌గా మెప్పించారు. ఇప్పుడు వాళ్ల‌బ్బాయి మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’గా రాబోత‌న్నారు. టైటిల్ చూడ‌గానే ఆయ‌న హ్యాపీగా ఫీల‌య్యారు. ఈ నెలాఖ‌రు నాటికి షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. డైరెక్ట‌ర్ గౌరి స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్‌, న‌టీన‌టుల సపోర్ట్‌తో సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేస్తున్నాం. సినిమా చ‌క్క‌గా వ‌స్తుంది. న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ‌గారికి, నా వెనుకే ఉండి నన్ను ప్రోత్స‌హిస్తున్న చ‌ద‌ల‌వాడ శ్రీనివాస్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ గౌరి రోణంకి మాట్లాడుతూ ‘‘జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌వితేజ‌గారి బ్ర‌ద‌ర్ ర‌ఘు కొడుకు మాధ‌వ్ హీరోగా న‌టిస్తోన్న సినిమాకు Mr ఇడియ‌ట్‌’  అనే టైటిల్ ఖ‌రారు చేశాం. దానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాం. మ‌రో ప్ర‌య‌త్నంతో మీ ముంద‌కు వ‌స్తున్నాను. మీ అంద‌రి ఆశీర్వాదాలు అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.