గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మే 2023 (13:06 IST)

25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కి జ్యోతిక.. అజయ్ దేవగన్, మాధవన్‌తో జోడీ

jyothika
అగ్ర హీరోయిన్ జ్యోతిక మళ్లీ బాలీవుడ్ తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పెళ్లికి తర్వాత జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఉన్నట్టుండి జ్యోతిక, ఆమె భర్త ముంబైకి మకాం మార్చారు. జ్యోతిక కోరిక మేరకు హీరో సూర్య ముంబైలో ఒక ఇల్లు తీసుకొని ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేశారు. 
 
జ్యోతిక ముంబైకి మారగానే ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అజయ్ దేవగన్, మాధవన్‌లు నటించే సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో 25 ఏళ్ల తర్వాత జ్యోతిక హిందీ సినిమాలో నటించనుంది. ఇందులో జ్యోతిక కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
 
వికాస్ భాల్ దర్శకత్వంలో మాధవన్, అజయ్ దేవగన్‌ కాంబోలో సినిమా రానుందని ట్విట్టర్ ద్వారా నిర్మాతలు ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కూడా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే కోలీవుడ్‌లో బాగా పండింది.