శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (13:00 IST)

''రాయలసీమ లవ్ స్టోరీ'' టీజర్.. బోల్డ్ సినిమానా? (video)

''రాయలసీమ లవ్ స్టోరీ'' సినిమా టీజర్‌ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్, హృశాలి జంటగా నటిస్తున్న ఈ సినిమాను రణధీర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటీవల బోల్డ్ పోస్టర్‌తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కావడం చర్చకు దారితీసింది. ఈ టీజర్‌ మొత్తం రొమాన్స్‌తో నింపేశారు. 
 
బాత్ టబ్‌లో హీరో, హీరోయిన్లు నగ్నంగా కామక్రీడల్లో తేలిపోతూ శృంగార రసాన్ని పండించారు. ఆ తర్వాత హీరోయిన్, హీరోని కొట్టి తనను మర్చిపోమని చెప్పడంతో టీజర్ ఎమోషన్ టర్న్ తీసుకుంది. 
 
అలాగే కమెడియన్ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ఇదిగో మీలాంటి వెధవల వల్లే దేశంలో నిరుద్యోగ సమస్యలు పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయంటూ చెప్పే పంచ్‌లు బాగున్నాయి. పోస్టర్‌తో హంగామా చేసిన ఈ సినిమా బృందం టీజర్‌తో మరింత హీట్ పెంచేస్తున్నారు. అయితే ఈ సినిమా బోల్డ్ సినిమా రేంజ్‌లో వుందని టాక్ వస్తోంది. ఇక దీపావళికి విడుదలైన టీజర్‌ ఎలా వుందో ఓసారి లుక్కేయండి.