మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (13:57 IST)

నా భార్య తెలుగు అమ్మాయే.. తెలుగింటి అల్లుడినే: సోనూసూద్

టాలీవుడ్ అంటే తనకు చాలా ఇష్టమని, తన మొదటి ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకేనని సినీ నటుడు సోనూసూద్ అన్నాడు. అల్లుడు అదుర్స్‌ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తాను టాలీవుడ్ నుంచే నేర్చుకున్నానని తెలిపాడు. తన భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ అని చెప్పాడు. దీంతో తాను తెలుగు కుటుంబంలో ఒకడినని తెలిపాడు.
 
బెల్లంకొండ సురేశ్ అంటే తనకెంతో అభిమానమని అన్నాడు. ఆయన ఏదైనా సినిమాలో పాత్ర ఉందని ఫోన్‌ చేస్తే వచ్చేస్తానని చెప్పాడు. ఆ సినిమాలోని పాత్ర, స్క్రిప్ట్‌ గురించి తనకు చెప్పాల్సిన అవసరమే లేదన్నాడు. అల్లుడు అదుర్స్ సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మనసున్న వ్యక్తని సోనూసూద్ ప్రశంసించాడు. ఆయన బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని చెప్పాడు.
 
కాగా.. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు సోనూసూద్. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రం కోసం పనిచేస్తున్న కార్మికులు వంద మందికి వంద ఫోన్లు కూడా అందించాడు.
 
లేటెస్ట్‌గా.. సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల్లుడు అదుర్స్'లోనూ నటించాడు సోనూ. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సోనూ మాట్లాడుతూ.. 'నేను తెలుగు వారి అల్లుడినే.. నా భార్య తెలుగు అమ్మాయే' అన్నాడు. తాను ఎన్ని భాషల్లో సినిమా చేసినా.. తెలుగు సినిమానే తన ఫస్ట్ లవ్ అని చెప్పుకొచ్చాడు సోనూ.