గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 16 జనవరి 2021 (17:08 IST)

సోనూ సూద్: ప్రయత్నిస్తే పోయేదేముంది, ప్యాంటు ముక్క అంతేగా?

న‌టుడు సోనూసూద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. అరుంధ‌తిలో విల‌న్‌గా అంద‌రికీ బాగా తెలిసినా... ఆయ‌న‌లోని మాన‌వ‌త్వ కోణం.. క‌రోనా త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. ఇదంతా ఒక‌ట‌యితే.. తాను ఎక్క‌డ వున్నా.. ఏదో ఒక‌టి చేస్తూ.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాడు. ఇటీవ‌లే అల్లుడు అదుర్స్ సినిమాలో డాన్స్ కూడా చేశాడు.
 
తాజాగా.. చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొర‌క‌డంతో త‌న బ‌ట్ట‌ల‌కు సంబంధించిన మెజ‌ర్మెంట్లుతో స్టిచింగ్‌ను తానే కుట్టుమిష‌న్ పైన వేసుకుంటున్న దృశ్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన చాలామంది నువ్వు ప‌నోడిమి స్వామి.. అంటూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.
 
ఔట్‌డోర్‌లో అన్ని చెట్లు వుంటే అక్క‌డే కాస్ట్యూమ్ వారు ఏర్పాటు చేసిన బ‌ట్ట‌లు, మిష‌న్‌పై తాను ద‌ర్జాగా ద‌ర్జీ ప‌ని చేస్తున్నాడు. షూటింగ్ గేప్‌లో కూడా ఏమాత్రం రిలాక్స్ కాకుండా వుంటున్నాడా అనిపిస్తుంది. ఇలాంటివి గ‌తంలో ర‌జ‌నీకాంత్ ఓ త‌మిళ సినిమా చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌న తెలుగు హీరోలు ఎవ్వ‌రూ ఇలాంటి ప‌నులు చేసిన దాఖ‌లాలు లేవు. కొంద‌రు మాత్రం.. వంట‌లో ప్రావీణ్యం పొందిన‌వారు ప‌లు షూటింగ్‌ల గేప్‌లో.. ఏదో ఒక వంట‌కాన్ని వండిన సంద‌ర్భాలు వున్నాయి.