గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (16:37 IST)

బావ పోయిన తర్వాత వారంతా దూరమయ్యారు : శ్రీహరి భార్య శాంతి

disco shanthi
టాలీవుడ్ విలక్షణ నటుడు శ్రీహరి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో ఆయన కుటుంబం అన్ని విధాలుగా నష్టపోయింది. ముఖ్యంగా శ్రీహరి సతీమణి శాంతి ఇంటికే పరిమితమై తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో క్షేమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీహరి మరణం తర్వాత ఆమె పడిన కష్టాలను వెల్లడించారు. "బావ (శ్రీహరి) చనిపోయిన తర్వాత ఆ షాక్ నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువగా మద్యం తీసుకుంటూ ఉండేదానిని. అలా రెండేళ్ళు గడిచిపోయాయి" అని చెప్పారు. 
 
మద్రాస్‌లో ఉన్న మావాళ్లు, వాతావరణం మార్పు కోసం రమ్మని ఉంటే వెళ్లాం. అక్కడే తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లివర్ డ్యామేజ్ అయిందని వైద్యులు చెప్పడంతో కొంతకాలం ఆస్పత్రికే పరిమితమయ్యాను. ఆ సమయంలో నా పిల్లలు ఏడుస్తూ నా పక్కనే ఉండేవారు. నాన్న పోయాక మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వు కూడా పోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు ప్రశ్నించారు. ఆ ఒక్క మాట తనను ఆలోచనలో పడేసింది. 
 
తన తర్వాత పిల్లలు అనాథలైపోతారనే భయంతో మద్యం ముట్టలేదు. శ్రీహరి ఉన్నపుడు ఆయన చుట్టూ కనిపించేవాళ్ళు ఆయన చనిపోయాక ఎవరూ కనిపించలేదు. శ్రీవారి తరపు బంధువులను తాను దూరం పెట్టాననే మాటలో ఎంతమాత్రం నిజంలేదు. బావ పోయాక ఒక్కొక్కరుగా వారంతకి వారే దూరమైపోయారు. ఇది సత్యం అని శాంతి పేర్కొన్నారు.