ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:26 IST)

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

Jani Master
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. అయితే జానీమాస్టర్‌ మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా… ఆ యువతి చెప్పేవన్నీ అబద్దాలని జానీమాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాదు ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకు ప్లాన్‌ చేశారని జానీమాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇక నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో… ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు జానీమాస్టర్‌ను తరలించారు పోలీసులు. 
 
జానీ మాస్టర్‌ కేసులో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. 
 
ఇటు యువతిపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు జానీమాస్టర్‌ భార్య సుమలత. కొరియోగ్రాఫర్‌గా ఎదగడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 
 
ఫ్యామిలీని వదిలేసి తన కోసం రావాలని జానీ మాస్టర్‌ను టార్చర్‌ పెట్టేదని షాకింగ్‌ నిజాలు వెల్లడించారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందన్నారు. ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు సుమలత.