మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (13:44 IST)

తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న రమ్యా నంబీశన్!

Ramya Nambeesan
కోలీవుడ్ హీరోయిన్ రమ్యా నంబీశన్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోంది. యంగ్ హీరో ఆది అథ్లెటిక్‌గా నటించిన తాజా చిత్రం 'క్లాప్‌'. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత బి.కార్తికేయన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. పృథ్వీ ఆదిత్య కథను సమకూర్చి దర్శకత్వం వహించారు.
 
తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్షా సింగ్‌, క్రిష్‌ కురుప్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌, మైమ్‌ గోపి, మునిష్కాంత్‌ తదతరులు నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్స్‌ సొంతం చేసుకుంది.
 
దీనిపై 'క్లాప్‌' చిత్ర నిర్మాత బి.కార్తికేయన్‌ మాట్లాడుతూ.. లహరి మ్యూజిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ సొంతం చేసుకునే ప్రతి ఒక్క చిత్రం ఆడియోకు మంచి పబ్లిసిటీ కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. 
 
లహరి మ్యూజక్స్‌ సంస్థపై సినీ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ సంస్థ 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌ చాప్టర్‌-2' వంటి చిత్రాల ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాంటి సంస్థకు మా చిత్రం ఆడియో రైట్స్‌ను అప్పగించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.