మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (19:32 IST)

రేణూ దేశాయ్‌‌కు కోపం వచ్చింది... పవన్ గురించి మీకేంటి? ఈ వీడియో చూసైనా మారండి... (Video)

పవన్‌ కళ్యాణ్‌ నుంచి విడిపోయి.. మరాఠీ సినిమాలు తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్న రేణూదేశాయ్‌.. అప్పుడప్పుడు పవన్‌ గురించి ట్వీట్‌లు చేస్తూ.. అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. పవన్‌ అలాంటివాడు.. ఇలాంటి

పవన్‌ కళ్యాణ్‌ నుంచి విడిపోయి.. మరాఠీ సినిమాలు తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్న రేణూదేశాయ్‌.. అప్పుడప్పుడు పవన్‌ గురించి ట్వీట్‌లు చేస్తూ.. అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. పవన్‌ అలాంటివాడు.. ఇలాంటి వాడంటూ.. స్పందించడం పరిపాటి అయింది. అయితే దీనివల్ల సెటిజన్లకు కాస్త కోపం వచ్చింది. ఆమె రాసిన విషయాలపై వారు స్పందిస్తూ.. కొన్ని కామెంట్లు చేశారు. 
 
అందులో అసభ్యకర పదజాలం వుండటంతో.. రేణు దేశాయ్‌.. తిరిగి వివరణ ఇచ్చింది. ''హాయ్‌, ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూను పోస్ట్‌ చేస్తాను. అందులోని విషయం నన్ను ఆదరించి, నా మంచి కోరే అభిమానులను ఉద్దేశించి కాదు. అది ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌లో నా వ్యక్తిగత జీవితం గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించినది. ఈ వీడియో చూసాక అయినా వాళ్ళల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటా.. అంటూ తన భావాలను వ్యక్తపరిచింది. గతంలో కూడా ఇలాగే ఓ ఇంటర్వ్యూను పోస్ట్‌ చేసి, కొంత స్పష్టత ఇచ్చారు. మరి ఇలాంటివి ఎన్ని ఇవ్వాల్సి వస్తుందో ముందుముందు..