శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (12:10 IST)

రేణూ దేశాయ్ లేటెస్ట్ వీడియో.. చీరకట్టు అదిరింది..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ టీవీ షోలో కనిపిస్తోంది. ప్రముఖ యాంకర్ ఉదయభానుతో కలిసి ఓ టీవీ షో చేస్తున్న రేణుదేశాయ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఇటీవల రేణూదేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం ఓ టీవీ షోలో కనిపిస్తోంది. ప్రముఖ యాంకర్ ఉదయభానుతో కలిసి ఓ టీవీ షో చేస్తున్న రేణుదేశాయ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఇటీవల రేణూదేశాయ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన క‌విత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ''డాలర్-ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్" అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో రేణూ దేశాయ్ విడుదల చేశారు.
 
దీన్ని అభిమానుల కోసం ట్విటర్‌లో షేర్‌ చేశారు. జ్ఞాపకాల సమాధులను తవ్వితీస్తూ... హృదయం ముక్కలైందంటూ రేణూ దేశాయ్ తెలిపింది. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రేణూ దేశాయ్ ఫన్ కోసం ఈ వీడియోను అప్ చేసినట్లు తెలిపింది. ఆ వీడియో రేణు అందంగా ముస్తాబై.. పట్టుచీరతో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చేలా వుందంటూ.. నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.