పవన్‌కు మాజీ భార్యగానే మిగిలిపోతా.. రెండో పెళ్ళి మాత్రం చేసుకోను: రేణూ దేశాయ్
ఖుషీ, జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ సరసన నటించి ఆయన్నే మనువాడి.. ఆపై ఆయనకు దూరమైన రేణూదేశాయ్ రెండో పెళ్ళి చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఖుషీ, జానీ వంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ సరసన నటించి ఆయన్నే మనువాడి.. ఆపై ఆయనకు దూరమైన రేణూదేశాయ్ రెండో పెళ్ళి చేసుకోనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం పట్ల ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతానని చెప్పారు. పవన్ మాజీ భార్యగా చలామణి అవుతూనే, కన్నడ సినీ పరిశ్రమలో సొంత గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పింది.
తామిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకున్నప్పటికీ, తాను మాత్రం మరో పెళ్లి చేసుకోబోనని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. పవన్ మాజీ భార్య హోదాతోనే తనకు మంచి గుర్తింపు వుందని చెప్పుకొచ్చారు. పవన్ అభిమానులంతా తనను ఇప్పటికీ 'వదిన' అనే పిలుస్తుంటారని హర్షం వ్యక్తం చేశారు. అలాంటి వారి అభిమానానికి, ప్రేమకు తాను మరో పెళ్లితో దూరం కాదలచుకోలేదని రేణూదేశాయ్ తెలిపారు.