ఆద్య కోసం పవన్ ఫోటోను అక్కడ పెట్టుకున్నా... రేణూ దేశాయ్ ట్వీట్, పవన్ ఏం చేస్తున్నారు?
ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా కామ్‌గా ఉండిపోయారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రం పవన్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా తమ కుమార్తె ఆద్య ఓ కోర్కెను
ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా కామ్‌గా ఉండిపోయారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రం పవన్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా తమ కుమార్తె ఆద్య ఓ కోర్కెను వెలిబుచ్చినట్లు ట్వీట్ చేశారు.
తన తండ్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి ఈరోజంతా నాన్న ఫోటోను పెట్టుకో అని అడిగిందట. ఆమె కోర్కె ప్రకారం ఈ రోజంతా తన ఫోనులో, ట్విట్టర్ ఖాతాలోనూ పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టుకున్నట్లు ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్‌కు పవన్ అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు నాడు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారనేది సస్పెన్స్. ఐతే ఆయన తన పుట్టినరోజును చాలా సాధారణంగా గడిపేస్తారనీ, తన పిల్లలతోనే ఎక్కువగా సమయాన్ని గడిపేస్తారని చెప్పుకుంటారు. కాగా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం తను నటించబోయే తదుపరి చిత్రం కాటమరాయుడు అని మాత్రం వెల్లడించారు. దీనితో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.