శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (10:30 IST)

రోజా అసలు పేరు ఏంటో తెలుసా? ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి, ఇపుడు రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఆర్కే. రోజా ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీనికి కారణం ఆమె ధైర్యం.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి, ఇపుడు రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఆర్కే. రోజా ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీనికి కారణం ఆమె ధైర్యం. మాటతీరే. ఆమె జోలికి వెళ్లాలంటే మగాళ్లు సైతం వణికిపోవాల్సిందే. అలాంటి రోజా గురించి టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 
 
1991లో 'ప్రేమతపస్సు' సినిమా స్టార్ట్‌ చేశాం. ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని చాలా చోట్ల ఆరు నెలల పాటు తిరిగాం. ఫైనల్‌గా శ్రీలత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె పేరును రోజాగా మార్చి ఆ చిత్రంతో వెండితెరకు పరిచయం చేశాం. ఆ రోజుల్లోనే రోజాకి ట్రైనింగ్‌ ఇచ్చి అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్పించాం. ఈ చిత్రంలోనే నిర్మాత పోకూరి బాబూరావుని విలన్‌గా పరిచయం చేశాం. ఒక బాధ్యత తీసుకుని రోజాని హీరోయిన్‌గా అందరికీ చూపించినట్టు గుర్తు చేశారు.