సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2017 (13:55 IST)

నాగార్జునతో సంబంధం ఉన్నట్టు గాసిప్ రాశారు... చదివి నవ్వుకున్నా : టబూ

తనపై వస్తున్న గాలివార్తలపై సీనియర్ నటి టబూ స్పందించారు. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణీతి చోప్రా, ప్రకావ్ రాజ్ లు నటిస్తున్నారు.

తనపై వస్తున్న గాలివార్తలపై సీనియర్ నటి టబూ స్పందించారు. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణీతి చోప్రా, ప్రకావ్ రాజ్ లు నటిస్తున్నారు. 
 
ఈ సినిమా ప్రచారం కార్యక్రమంలో భాగంగా టబూ మాట్లాడుతూ... బయోపిక్ ద్వారా కానీ, ఆటోబయోగ్రఫీ ద్వారా కానీ తన జీవితాన్ని ఎవరికీ చెప్పబోనని తెలిపింది. తన జీవితం గురించి ఇతరులకు చెప్పాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసింది. 
 
ఆటోబయోగ్రఫీలు బాగానే ఉంటాయి... అయితే, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉండాలని చెప్పింది. తన గురించి బయట ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయని... వాటిని విని, ఇవి తన గురించేనా అనుకుంటానని తెలిపింది. 
 
ముఖ్యంగా, టాలీవుడ్‌లో అయితే, తనకు హీరో నాగార్జుకు సంబంధం ఉందనీ, హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనిచ్చారంటూ ఇలా ఏవేవో గాసిప్స్ రాశారని గుర్తు చేశారు. ఈ వార్తలు చదివి నవ్వుకోవడం మినహా తాను చేయగలిగిందేమీ లేదన్నారు.