బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (16:40 IST)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తో ఆర్.కే సాగర్ ఏమన్నాడో తెలుసా !

RK Sagar  Deputy CM Pawan Kalyan
RK Sagar Deputy CM Pawan Kalyan
బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌తో స్టార్‌గా మారిపోయారు ఆర్కే సాగర్. పలు సినిమాలతోనూ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక ఆయన సినిమాలే కాకుండా రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ గారినే స్పూర్తిగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూ జన సేన కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
 
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దేశ రాజకీయ చరిత్రలో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో జన సేన సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆర్.కే సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో జన సేన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు.
 
తెలంగాణలోనూ జన సేన సత్తా చాటాలని, అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించాలని అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఆర్.కే సాగర్ చర్చించారు. ఈ భేటికి సంబంధించిన ఫోటోలను ఆర్.కే సాగర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోల్లో జన సేనాని, ఆర్.కే సాగర్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.