మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (11:07 IST)

హైదరాబాదుకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్

naatu naatu oscar award
ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాదుకు చేరుకుంది. ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికాలో పార్టీలు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు రాజమౌళి. రాజమౌళి, రమ, కీరవాణి, వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహ తదితరులు.. ఎయిర్ పోర్ట్‌లో వీరికి ఘన స్వాగతం లభించింది. 
 
రాజమౌళి, కీరవాణిలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళిలు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.