శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (09:48 IST)

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్

highspeed rail corridor
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుకానుంది. ముఖ్యంగా, హైదరాబాద్  - విశాఖ నగరాల మధ్య ఈ కారిడాన్‌ను నిర్మించనున్నారు. అలాగే, విజయవాడ నుంచి కర్నూలుకు కూడా ఈ కారిడార్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో హైస్పీడ్ రైలు ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకటి, రెండు నెలల్లోనే ప్రాథమిక ఇంజనీరింగ్, ట్రాఫిక్ స్టడీ (పెట్) సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం, విజయవాడ వెళ్లేందుకు వరంగల్ మీదుగా ఒకటి, నల్గొండ మీదుగా మరో మరోమార్గం అందుబాటులో ఉంది. వరంగల్ మార్గంలో గరిష్టంగా 150 కిలోమీటర్ల మేరకు రైళ్లు దూసుకెళుతున్నాయి. ఇపుడు ప్రతిపాదిత కారిడార్లలో గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలన్నది రైల్వే శాఖ యోచిస్తుంది. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే టెండర్లు కూడా ఆహ్వానించింది. 
 
ఈ రైల్వే కారిడార్‌లో ఏయే మార్గంలో ఉండాలన్న దానిపై ఆ సంస్థ ఆరు నెలల్లో ఓ నివేదిక తయారు చేసి సమర్పిస్తుంది. దీన్ని బట్టి ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించ సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందిస్తారు. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం నుంచి విశాఖపట్టణం మధ్య ప్రయాణ సమయం 12 నుంచి  గంటల నుంచి 4 గంటలకు తగ్గుతుంది.