శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (17:33 IST)

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ టీ స్టాల్.. నెట్టింట ఫోటోలు వైరల్

Tea Stall
Tea Stall
వేడి టీ కప్పు కంటే మెరుగైన ప్రయాణ సహచరుడు వుండడని రైలు ప్రయాణీకులకు బాగా తెలుసు. రోడ్ సైడ్‌లో నిల్చున్నప్పుడు.. రైలు ప్రయాణంలో చాయ్ తాగడం అందరికీ అలవాటే. భారతీయ రైల్వే ప్రయాణీకులు చాయ్‌ని ఎక్కువ తాగేస్తుంటారు.
 
రైళ్లలో టీ అమ్మేవారి కేకలు దేశంలోని చాలా స్టేషన్లలో సర్వసాధారణంగా వినిపించి ఉంటాయి. రైలులో వేడిగా వడ్డించే ఆ చిన్న కప్పు టీని సిప్ చేయడంతో పోల్చలేని అనుభూతిని కలిగిస్తుంది. టీ ప్రేమికులను అడిగితే చాయ్ టేస్ట్ జర్నీలో ఎలా వుంటుందో చెప్పవచ్చు.  
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చొరవలో భాగంగా గౌహతి రైల్వే స్టేషన్‌లో "ట్రాన్స్ టీ స్టాల్" ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న ఈ టీ స్టాల్ దేశంలోనే మొదటిది. 
 
ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ టీ స్టాల్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఫోటోలు కొత్తగా తెరిచిన టీ స్టాల్‌ను పూలమాలలతో అలంకరించారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. "ట్రాన్స్ టీ స్టాల్" అని రాసి ఉన్న బోర్డు చూడవచ్చు. ఈ వీడియోతో పాటు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.