బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (15:32 IST)

రైలు ప్రయాణికులకు చేదువార్త.. 70 కేజీల బరువు దాటితే పైసలు చెల్లించాల్సిందే..

Luggage Rules
భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగానే రైలు ప్రయాణికులకు చేదువార్త వంటింది. ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే రైలు ప్రయాణికుల లగేజీ 70 కేజీలు దాటితో ఇకపై పైసలు చెల్లించాల్సిందేనంటూ కొత్త నిబంధన ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఎంత లగేజీ తీసుకెళ్లినా రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పేవాళ్లు కాదు. కానీ, ఇకపై అలా కుదరదని రైల్వే శాఖ తెగేసి చెప్పింది. 
 
ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో ప్రయాణికుడు తీసుకెళ్లే లగేజీపై పరిమితి విధించింది. ఈ పరిమితి దాటి లగేజీని తీసుకెళితే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. విమాన ప్రయాణాల తరహాలోనే అదనపు లగేజీకి ఛార్జి చెల్లించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అధిక లగేజీతో ప్రయాణించొద్దని, అవసరమైతే లగేజీ పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అలాగే, ఎవరు ఎంత లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చో కూడా ప్రకటించింది. 
 
* ఫస్ట్ క్లాస్‌ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తమతో ఫ్రీగా తీసుకెళ్లవచ్చు.
* సెకండ్‌ క్లాస్‌ ఏసీలో 50 కిలోలు, థార్డ్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు. 
* సెకండ్ క్లాస్‌లో 25 కిలోల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 
* ఈ పరిమితి దాటితే రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించాలి.
* బుక్‌ చేసుకోకుండా అదనపు లగేజీతో ప్రయాణించే వారికి బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా విధిస్తామని రైల్వే హెచ్చరించింది.