శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (18:44 IST)

'సాహో' చిత్రం సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఎంత వసూలు కావాలో తెలుసా?

బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' మరో నాలుగు రోజుల్లో థియేటర్‌లలోకి రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. 
 
గతేడాది సౌత్ నుంచి భారీ క్రేజ్‌తో రజనీ నటించిన 2.0 సినిమా రిలీజైంది. అయితే కొంత డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఆ రేంజ్ క్రేజ్‌తోనే ఇప్పుడు సాహో చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం దాదాపు రూ. 320 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం అందుతుంది.  
 
దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.350 కోట్ల వరకు షేర్ రావాలి. అలా వస్తేనే సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళ్తుంది. బాహుబలి సినిమాల మాదిరి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. సినిమాకు లాభాలు రావడం పెద్ద విషయమేమీ కాదు.  ఒకవేళ ప్రతికూలంగా టాక్ వస్తేనే ఎలా అన్నది ఆలోచించాలి. 
 
ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెన్సార్ రిపోర్ట్‌ల ప్రకారం సినిమా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 30వ తేదీ వరకు ఆగాల్సిందే.