ఆధ్యాత్మిక థ్రిల్లర్.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..
మెగా మేనల్లుడు సాయి ధరమ్ రూటు మార్చాడు. తేజ్ కథలను ఎంచుకోవటంలో కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పండగే సినిమా తరువాత మళ్ళీ కమర్షియల్ కథలను పక్కన పెట్టాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక కొత్త టైప్ లవ్ స్టోరీని టచ్ చేస్తున్నాడు.
తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటుస్తున్నాడు ఈ మెగా హీరో. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. సాయితేజ్‌కు ఇది 15వ చిత్రం.
ఈ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజైంది. పోస్టర్ చూస్తుంటే ఏదో తాంత్రిక శక్తులకు సంబంధించిన కథాంశం అని అర్థమవుతోంది.
దీనిపై తేజ్ స్పందిస్తూ.. ''న్యూ జోనర్ ట్రై చేయడం ఎల్లప్పుడూ ఎగ్జైటింగ్‌గా ఉంటుంది.. అది కూడా నా ఫేవరేట్ మూవీ మేకర్ సుకుమార్ సహకారంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్'' అని పేర్కొన్నారు.