మంగళవారం, 24 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 జూన్ 2016 (11:44 IST)

జవాన్‌గా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. ఇంటికొక్కడు అనే ట్యాగ్‌లైన్ కూడా?!

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం జవాన్‌గా ముందుకొచ్చాడు. ఇప్పటికే తిక్క టైటిల్‌పై రూపొందుతున్న మూవీని ఫినిషింగ్ స్టేజ్‌కి తెచ్చిన సాయిధరం తేజ్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో పక్కా క్లారిటీతో ముందుకు దూసుకెళ్తున్నాడు.
 
తిక్క కాకుండా ఇప్పటికే రెండు సినిమాలకు సాయిధరమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒకటి బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనుండగా.. మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. తిక్క తర్వాత వెంటనే బీవీఎస్ రవి చిత్రాన్నే స్టార్ట్ చేస్తాడట తేజు. ఇప్పటికే సాయిధరం తేజ్‌కి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ ఓ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో.. ఈ మూవీ తెరకెక్కుతుంది. 
 
ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందట. మొత్తానికి సుప్రీమ్ హీరో వరుసగా సినిమాలపై సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీ అయిపోతున్నాడు.