శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:27 IST)

సాయిపల్లవి వైబ్రేషన్స్ : మూడు పాటలకు పది కోట్ల వ్యూస్

తెలుగు వెండితెరపై సందడి చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో ప్రతి ఒక్కరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న సాయి పల్లవి.. అటు నటనతో పాటు.. ఇటు డ్యాన్సుల్లో హీరోలకు ధీటుగా స్టెప్స్ వేస్తోంది. 
 
ముఖ్యంగా, వరుణ్ తేజ్ నటించిన 'ఫిదా' చిత్రంలో 'వచ్చిండే...' సాంగ్‌లో సాయి పల్లవి స్టెప్స్ ప్రేక్షకులను కేకపుట్టించాయి. ఈ పాట టాలీవుడ్‌ను కొన్నేళ్ళ పాటు షేక్ చేసింది. ఆ తర్వాత తమిళ హీరో ధనుష్ నటించిన మారి-2 చిత్రంలో 'రౌడీ బేబీ..' పాటతో మరోమారు సాయిపల్లవి వైబ్రేషన్స్ సృష్టించింది. ఈ చిత్రంలో హీరోతో కలిసి సాయి ప‌ల్ల‌వి వేసిన స్టెప్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. 
 
అయితే సాయి ప‌ల్ల‌వి న‌టించిన 'ఫిదా' చిత్రంలోని 'వ‌చ్చిండే' సాంగ్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే, దానిని 'రౌడీ బేబి' సాంగ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డ్ ఆమె ఖాతాలో చేరింది. 'ఎంసీఏ' చిత్రంలోని "ఏవండోయ్ నాని గారు.." అనే సాంగ్‌కి సాయి ప‌ల్ల‌వి, నాని క‌లిసి డ్యాన్స్ చేయ‌గా, ఇందులోని స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. 
 
ఈ పాటను యూట్యూబ్‌లో వంద మిలియన్ల మంది వీక్షించారు. అంటే.. ఫిదా, మారీ-2, ఎంసీఏ చిత్రాల్లో సాయి పల్లవి నటించిన మూడు పాటలను ఇప్పటివరకు ప‌ది కోట్ల‌ నెటిజన్లు వీక్షించారు. అంటే ఈ మూడు పాటలకు వంద కోట్ల వ్యూస్ వచ్చాయన్నమాట. ఈ పాటను ఇప్పటి వరకు 10 కోట్ల లక్షా 31 వేల 289 మంది నెటిజన్లు వీక్షించగా, 224వేల మంది లైక్ చేశారు. 49 వేల మంది డిజ్‌లైక్ చేశారు.