శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (17:21 IST)

సారీ బాస్.. నా క్రేజ్‌ను క్యాష్‌గా మలుచుకోలేను : సాయి పల్లవి

ఒకే ఒక్క చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 'ఫిదా' చిత్రంలో ఆమె నటనకుగాను సినీ జనాలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వరిస్తున్నాయి.

ఒకే ఒక్క చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 'ఫిదా' చిత్రంలో ఆమె నటనకుగాను సినీ జనాలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వరిస్తున్నాయి. అయినప్పటికీ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా, తనకు నచ్చిన కథలనే సాయి పల్లవి ఎంచుకుని ముందుకుసాగుతోంది.
 
అంతేకాదండోయ్.. తనకు పాత్ర ముఖ్యమనీ, పారితోషికాలు కాదని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. పైగా, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు.. ఈవెంట్స్‌కు డబ్బుకోసం మాత్రం వెళ్లనని తగేసి చెప్పింది. సాయి పల్లవి ఇప్పటికీ ఈ మాటకు కట్టుబడివుంది. 
 
తాజాగా ఓ బడా సంస్థకి చెందిన ప్రతినిధులు... అమెరికాలో జరుగనున్న తమ ఈవెంట్‌కి కొన్ని గంటల పాటు హాజరు కావాలనీ, అందుకు రూ.13 లక్షల వరకూ ఇస్తామని ఆఫర్ చేశారట. దీంతో పాటు బిజినెస్ క్లాస్ టికెట్స్‌, స్టార్ హోటల్లో బస కల్పిస్తామని హామీ ఇచ్చారట. 
 
అయినా సాయిపల్లవి ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తనకు గల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ఆలోచన సాయిపల్లవికి లేదనే విషయాన్ని గతంలోనూ కొన్ని సంఘటనలు నిరూపించాయి.