''కణం'' ట్రైలర్ చూస్తే.. సాయిపల్లవిని మెచ్చుకుంటారు.. (వీడియో)

''ఛలో''తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, ఫిదా, ఎంసిఎ వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'కణం'. ఈ సినిమాకు అమలాపాల్ మాజీ భర్త విజయ్ దర్శకుడు. శ్యాం సి.ఎస్‌. సంగీత సారథ్యం వహించ

selvi| Last Updated: బుధవారం, 7 మార్చి 2018 (17:24 IST)
''ఛలో''తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, ఫిదా, ఎంసిఎ వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'కణం'. ఈ సినిమాకు అమలాపాల్ మాజీ భర్త విజయ్ దర్శకుడు. శ్యాం సి.ఎస్‌. సంగీత సారథ్యం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ''కణం'' సినిమా కోసం రజనీకాంత్‌ ''2.0''కి కెమెరా వర్క్‌ అందించిన నిరవ్‌షా పనిచేశాడు.

నాగశౌర్య, సాయిపల్లవితో పాటు ఈ సినిమాలో వెరోనికా అనే చిన్న పాప అద్భుతమైన పాత్రలో నటించిందని సినీ యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం మార్చి 5న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ... తల్లికి, బిడ్డకు ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన పాప వెరోనికాతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని సాయిపల్లవి తెలిపింది. ఫిదా, ఎంసీఏ తరహాలో ''కణం'' కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

ఇకపోతే.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'కణం' సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
దీనిపై మరింత చదవండి :