శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (15:54 IST)

పూజా హెగ్డేని రంగంలోకి దింపిన సల్మాన్ ఖాన్

Pooja Hegde
Pooja Hegde
2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా మాస్ ఆదరణ పొందిన చిత్రంగా కూడా నిలిచింది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, బాలనటి హర్షాలీ మల్హోత్రా నటించారు, సాధారణ భారతీయుడు, ఒక చిన్న పాకిస్తానీ అమ్మాయి మధ్య అసాధారణ బంధం గురించి ఈ చిత్రం హృదయాలను కదిలించింది.
 
గత సంవత్సరం, పవన్ పుత్ర పేరుతో బజరంగీ భాయిజాన్ సీక్వెల్ ప్రకటించినప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులు సంతోషించారు. తమ అభిమాన నటుడ్ని మళ్లీ అదే పాత్రలో  చూడాలనుకున్నారు. కానీ ప్రకటన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్‌డేట్ రాలేదు.
 
అయితే ఇప్పుడు పవన్ పుత్ర కోసం సల్మాన్ పూజా హెగ్డేని రంగంలోకి దింపినట్లు తెలిసింది.  ఈ చిత్రంలో ఆమె కరీనా పోషించిన పాత్రనే పూజ చేస్తుందో లేదో ఇంకా తెలియలేదు. ఆసక్తికరం ఏమంటే , సల్మాన్ రాబోయే సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కూడా పూజా హీరోయిన్.. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.