శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (22:24 IST)

పవన్ కల్యాణ్ సినిమా..పూజా హెగ్డేకు చెక్ పెట్టిన శ్రీలీల! (video)

sree leela
పెళి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం శ్రీలీలా చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. ప్రస్తుతం మహేష్ 28 సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో పూజా హెగ్డ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
 
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందించనున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను తీసుకోనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ కూడా చేసినట్లు టాక్.
 
ఈ చిత్రానికి ముందు పూజానే కథానాయికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని శ్రీలీలతో భర్తీ చేసేందుకు హరీష్ రంగం సిద్ధం చేస్తున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.