సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (19:38 IST)

ఆవారా-2 సీక్వెల్‌కు సిద్ధమవుతున్న లింగుసామి

Awara-2
Awara-2
ప్రముఖ దర్శకుడు లింగుసామి పందెంకోడి, ఆవారా లాంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆవారా సినిమాకు సీక్వెల్ రూపొందించనున్నట్లు ప్రకటించారు. 
 
తమిళ్‌లో కార్తీ, తమన్నా జంటగా లింగుసామి దర్శకత్వంలో "పయ్యా"గా తెరకెక్కిన సినిమా తెలుగులో ఆవారాగా రిలీజైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. 
 
పలు అవార్డులని కూడా దక్కించుకుంది ఈ సినిమా. దీంతో ప్రస్తుతం హిట్స్ లేక అల్లాడుతున్న లింగుసామి ఆవారా సినిమాకు సీక్వెల్ తీసే పనివో వున్నారు. 
 
ఆవారా-2 కథని ఇప్పటికే కార్తీ, సూర్యకు చెప్పినా వాళ్ళు నో చెప్పడంతో తమిళ్ హీరో ఆర్యకి ఈ స్క్రిప్ట్ చెప్పగా ఓకే చెప్పినట్టు సమాచారం. అలాగే హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతోంది.