1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 3 సెప్టెంబరు 2016 (21:59 IST)

ఐశ్వర్యా రాయ్ అందాన్ని అలా చూస్తుండిపోయా... సల్మాన్‌ ఖాన్ కామెంట్...

ఐశ్వర్యా రాయ్‌ అందం గురించి బాలీవుడ్‌ టైగర్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి మెచ్చుకున్నాడు. చాలా అందంగా వుందంటూ.. ఆమె నటించిన 'ఆ దిల్‌ హై ముష్కిల్' చిత్రం టీజర్‌ విడుదలైన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయన దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైనప్ప

ఐశ్వర్యా రాయ్‌ అందం గురించి బాలీవుడ్‌ టైగర్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి మెచ్చుకున్నాడు. చాలా అందంగా వుందంటూ.. ఆమె నటించిన 'ఆ దిల్‌ హై ముష్కిల్' చిత్రం టీజర్‌ విడుదలైన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయన దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. 
 
ఆ టీజర్‌లో ఎక్కువగా ఎంతో అందంగా వున్న ఐశ్వర్యనే చూస్తుండిపోయానని పేర్కొన్నాడు. ఇందులో రణబీర్‌ కపూర్‌తో ఐశ్వర్య నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ గురించి బాలీవుడ్‌లో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇందులో ఐశ్వర్య మధ్య వయస్కురాలి పాత్ర పోషించింది. రణబీర్‌.. ఐశ్వర్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించగా ధర్నా ప్రొడక్షన్‌లో రూపొందింది. దీపావళికి ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.