మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (17:03 IST)

యువతిపై చేయి చేసుకున్న సల్మాన్ ఖాన్ బాడీగార్డు.. కేసు నమోదు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ బాడీగార్డ్ ఓ యువతిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముంబైలోని ఒక పబ్లో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ బాడీగార్డ్ ఓ యువతిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముంబైలోని ఒక పబ్లో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై బాడీగార్డు షేరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆ పబ్‌లోని వ్యక్తులను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా, వారితో దురుసుగా వ్యవహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంధేరి శివారులోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో షేరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కాగా, ఎంతో కాలంగా సల్మాన్‌కు బాడీగార్డ్‌గా షేరా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు వివాదాలు, కోర్టు కేసులతో సతమతం అవ్వడం సల్మాన్ ఖాన్‌కు సాధారణమైపోయింది.