మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 3 జులై 2019 (17:12 IST)

తిరుమ‌ల‌లో స‌మంత‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ఓ బేబి. ఈ చిత్రానికి  నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ విభిన్న క‌థా చిత్రంలో  సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా అంద‌ర్నీ ఆలోచింప చేసే క‌థాంశంతో ఈ సినిమా రూపొంద‌డం..ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఓ..బేబి విజ‌యం సాధిస్తుంద‌నే టాక్ ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. 
 
ఈ నెల 5న ఓ..బేబి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.  చిత్ర ద‌ర్శకురాలు నందినీరెడ్డితో కలిసి ఆమె తిరుమలకు రాగా, అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.  స్వామి వారి సేవలో సమంత, నందినీ రెడ్డి పాల్గొన్నారు. 
 
మ‌జిలీ సినిమా టైమ్‌లో కూడా స‌మంత తిరుమ‌ల వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఇప్పుడు ఓ బేబి రిలీజ్ టైమ్‌కి కూడా ఇలా ద‌ర్శ‌నం చేసుకోవ‌డం విశేషం. మ‌జిలీ స‌క్స‌స్ అవ్వ‌డంతో సెంటిమెంట్‌గా భావించిన‌ట్టుంది. మ‌రి.. అప్ప‌ుడు వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇప్పుడు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి. వీడియో చూడండి...