శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:08 IST)

"శాకుంతలం" విడుదల తేదీ వెల్లడి.. ఖుషీగా సమంత ఫ్యాన్స్ (video)

shaakuntalam
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న కొత్త చిత్రం "శాకుంతలం". ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని నవంబరు నాలుగో తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించాయి తాజాగా చిత్రం రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటనతో పాటు కొత్త ఫోటో, మోషన్ పోస్టరును కూడూ చిత్ర బృందం రిలీజ్ చేసింది. 
 
మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథని ఆధారంగా చేసుకుని 'శాకుంతలం' తెరకెక్కించారు. గుణశేఖర్‌ దర్శకుడు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. 
 
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి గుణ శేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది.