ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 12 జనవరి 2018 (20:00 IST)

మా అమ్మ నన్ను బలవంతంగా అక్కడకు లాక్కెళ్ళేది - సమంత

సమంత.. ఈ పేరు వింటేనే క్యూట్ గర్ల్.. బబ్లీ గర్ల్.. గుర్తొస్తుంది. అలాంటి సమంత వివాహమైన తరువాత కూడా బిజీగానే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈమధ్య కాలంలో సమంత ట్విట్టర్‌లో ట్వీట్లు ఎక్కువ చేయడం ప్రారంభించింది. వివాహమైన తరువాత తాను ఏ విధంగా సంతోషంగా ఉన్న

సమంత.. ఈ పేరు వింటేనే క్యూట్ గర్ల్.. బబ్లీ గర్ల్.. గుర్తొస్తుంది. అలాంటి సమంత వివాహమైన తరువాత కూడా బిజీగానే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈమధ్య కాలంలో సమంత ట్విట్టర్‌లో ట్వీట్లు ఎక్కువ  చేయడం ప్రారంభించింది. వివాహమైన తరువాత తాను ఏ విధంగా సంతోషంగా ఉన్నాను.. అలాగే తన కుటుంబ సభ్యుల గురించి ఇలా ఎన్నో విషయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తోంది సమంత.
 
తాజాగా సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటో, సమాచారం వైరల్‌గా మారుతోంది. చర్చికి నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని కాదు. బలవంతంగా నన్ను మా అమ్మ లాక్కెళ్ళేది. కొన్ని రోజులు నేను బలవంతం మీద వెళ్ళాను. ఆ తరువాత యేసుప్రభువు గొప్పతనం తెలిసి ఇక నేనే వెళ్ళడం ప్రారంభించాను. ఖాళీ దొరికితే చర్చికి వెళ్ళిపోతుంటాను అంటోంది సమంత.