బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (10:53 IST)

#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో 'ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, వెళ్లి ఆమెను బాగా చూడు' అంటూ హీరో తల్లి డైలాగ్ కొడుతోంది. తమ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే ఉంటామని హీరో అంటున్నాడు. 'ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు' అంటూ హీరో తల్లి చెప్పిన మరో డైలాగ్‌ను ఈ ట్రైలర్ ద్వారా వినిపించారు. అమ్మ చెప్పే మాటలు వినిపించుకోని హీరో ప్రేయసి చెప్పే మాటలను మాత్రం తప్పకుండా పాటిస్తున్నాడు. ఆ ట్రైలర్‌ను ఓసారి చూడండి. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.