ధనుష్ నా కాపురాన్ని నిలబెట్టాలనుకున్నాడు.. దుష్ప్రచారం చేయడం నీచం: అమలా పాల్
అమలాపాల్-విజయ్ విడాకులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమంటూ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమలకు, ధనుష్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివాహా
అమలాపాల్-విజయ్ విడాకులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమంటూ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమలకు, ధనుష్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివాహానికి పూర్వం, విడాకుల తర్వాత వరుసబెట్టి ధనుష్ సినిమాల్లో అవకాశాలు అందుకోవడంతో ఈ డౌట్ మరింత ఎక్కువైంది.
ప్రస్తుతం ధనుష్ సారథ్యంలో ''వీఐపీ-2''లో అమలను తీసుకోవద్దని ధనుష్‌ను కోరిందట ఆమె మాజీ భర్త కుటుంబం. కానీ, ధనుష్ వారిని లెక్కచేయకుండా అమలకే ఛాన్సిచ్చాడని వస్తున్న వార్తలపై అమలాపాల్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
ఇలా ఓ పెళ్లైన వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయడం చాలా నీచమని విరుచుకుపడింది. ధనుష్ తన శ్రేయోభిలాషి అని, తన కాపురాన్ని నిలబెట్టడానికి కూడా ప్రయత్నించాడని చెప్పింది. అలాంటి వ్యక్తితో తన పేరును ముడిపెడుతూ.. వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.