సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (17:16 IST)

ఆ రెండు ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా

తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. 
 
ఈ రోజు సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు. నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. సమంత వేసిన ఈ పరువు నష్ట దావా పై కాసేపట్లో కూకట్ పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా… అక్కినేని నాగార్జున మరియు సమంత గత మూడు వారాల కింద విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.