ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:10 IST)

'యూ ఆర్ మై గ్రేటెస్ట్ హీరో' అంటున్న హీరోయిన్ సమంత.. ఎవర్నీ?

సమంత... టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు. త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లనుంది. టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది.

సమంత... టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు. త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లనుంది. టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. వీరి వివాహం అక్టోబరులో జరుగనుంది. అయితే, ఆర్వీ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘యుద్ధం శరణం’ చిత్రం టీజర్ సోమవారం విడుదలైంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా నాగచైతన్య పంచుకున్నారు. 
 
ఈ ట్వీట్‌కు చైతూకు కాబోయే భార్య, హీరోయిన్ సమంత స్పందించింది. ‘మై గ్రేటెస్ట్ హీరో!’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సమంత రిప్లై ఇచ్చింది. కాగా, ‘శత్రువులు ద్రోహం చేసినా, ఆశలు ఆవిరైనా... నేను ధైర్యంగా జీవించగలను’ అంటూ నాగచైతన్య నిన్న తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా ఈ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకూ 11 లక్షల మందికి పైగా దీనిని వీక్షించడం గమనార్హం.