బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (14:50 IST)

అక్టోబర్ లోపు నాలుగు సినిమాలు పూర్తి.. సమంత మాస్టర్ ప్లాన్..

హీరోయిన్ సమంత నాగచైతన్యను అక్టోబర్‌లో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇంతలో తాను కమిట్ అయిన సినిమాలను ముగించేందుకు సమంత మాస్టర్ ప్లాన్ వేసేసింది. సమంత ప్రస్తుతం తమిళంలో విజయ్ 61తో పాటు మరో మూడు సి

హీరోయిన్ సమంత నాగచైతన్యను అక్టోబర్‌లో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇంతలో తాను కమిట్ అయిన సినిమాలను ముగించేందుకు సమంత మాస్టర్ ప్లాన్ వేసేసింది. సమంత ప్రస్తుతం తమిళంలో విజయ్ 61తో పాటు మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలను పెళ్ళి లోపు పూర్తి చేయాలని సమంత ప్లాన్ చేస్తోంది. పెళ్ళికి ముందే సినిమాలను పూర్తి చేసి.. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి రెస్ట్ తీసుకోవాలని సమంత భావిస్తోంది. 
 
ఈ క్రమంలో ఒక నెలలో ఒక సినిమాను పూర్తి చేయాలనుకుంటుందట. దీంతో నాలుగు కోలీవుడ్ సినిమాలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సమంత అంటోంది. ఇందుకోసం పూర్తి స్థాయిగా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు సమంత రెడీ అయిపోతోంది.