ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (12:49 IST)

''యూటర్న్'' తీసుకుంటానంటోన్న సమంత..

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. పెళ్లికి తర్వాత కూడా సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వుంది. ప్ర

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. పెళ్లికి తర్వాత కూడా సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వుంది. ప్రస్తుతం సమంత చేసిన రెండు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో చేసిన ''రంగస్థలం'' మార్చి 30వ తేదీన విడుదల కానుంది. 
 
అలాగే తమిళంలో చేసిన "ఇరుంబుతిరై''ను తొలుత ఈ నెల 26వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వా ఈ సినిమాను కూడా మార్చిలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాల షూటింగ్ ముగిసిన నేపథ్యంలో సమంత తెలుగు, తమిళ భాషల్లో 'యూటర్న్' సినిమా చేయడానికి సిద్ధమైంది.
 
కన్నడలో హిట్ కొట్టిన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే సినిమాలకు కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రానుంది. ఈ ఇరు భాషల్లోనూ సమంతనే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.