శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:44 IST)

'ఖల్‌నాయక్' జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించనున్న సంజు (టీజర్)

బాలీవుడ్‌లో 'ఖల్‌నాయక్‌'గా పేరుగాంచి, ఆ తర్వాత అక్రమ ఆయుధాల కేసులో ముద్దాయిగా తేలిన బాలీవుడ్ హీరో సంజయ్‌దత్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కనుంది.

బాలీవుడ్‌లో 'ఖల్‌నాయక్‌'గా పేరుగాంచి, ఆ తర్వాత అక్రమ ఆయుధాల కేసులో ముద్దాయిగా తేలిన బాలీవుడ్ హీరో సంజయ్‌దత్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "సంజు" అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సంజూభయ్యా పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషిస్తున్నాడు.
 
ఇందులో ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంజయ్ తన జీవితంలో ఎదుర్కొన్న భిన్న పరిస్థితులను ఈ ఫిల్మ్‌లో చూపించనున్నారు. సినీ లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేశాడో.. అక్రమ ఆయుధాల కేసులో ఎలా జైలుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ ఫిల్మ్‌లో ప్రజెంట్ చేయనున్నారు. దత్ జీవితంలోని వివిధ కోణాలను నవ్వుకునే రీతిలో తెరకెక్కించారు. ఈ సినిమాలో పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, విక్కీ కౌశల్, జిమ్ సార్బా, బోమన్ ఇరానీలు కూడా ఉన్నారు.