బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (13:02 IST)

''కాలా'' టీజర్ అదుర్స్.. (video)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ''కాలా'' సినిమా టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. కబాలి సినిమాకు తర్వాత భారీ అంచనాల నడుమ ''కాలా'' విడుదలవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. క

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ''కాలా'' సినిమా టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. కబాలి సినిమాకు తర్వాత భారీ అంచనాల నడుమ ''కాలా'' విడుదలవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కబాలి సినిమాకు దర్శకత్వం వహించిన పా రంజిత్ ''కాలా''కి కూడా దర్శకత్వ పగ్గాలు చేపడుతున్నారు. ముంబైలో మాఫియా నేపథ్యంలో సాగే సినిమాగా కాలా తెరకెక్కుతోంది. 
 
ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాత. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చాడు. ఇకపోతే.. కాలా ట్రైలర్‌కు వీక్షకుల సంఖ్య రెండు కోట్లను అధిగమించింది. తద్వారా సూపర్‌స్టార్ మరోసారి తన స్టామినా చాటుకుంటున్నారు. గతంలో ''కబాలీ'' చిత్రం టీజర్‌కి కూడా ఇదే తరహాలో స్పందన లభించిన సంగతి తెలిసిందే. 
 
కాగా సూపర్ స్టార్ రజనీకాంత్, నానా పటేకర్, హ్యూమా ఖురేషీ, సంపత్ రాజ్, అంజలీ పటేల్, దిలీపన్, పంకజ్ త్రిపాఠి, అరుణ్ దాస్, అరవింద్ ఆకాష్, అరుంధతి తదితరులు నటించిన ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్, వుండెర్‌బార్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.