సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (17:45 IST)

కలెక్టర్ పాత్రలో అదరగొట్టిన నయన్.. "కర్తవ్యం" టీజర్

మలయాళ కుట్టి నయనతార ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం "కర్తవ్యం". ఇది తమిళ చిత్రం "అరం"కు రీమేక్. మింజుర్ గోపి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కంప్లీట్ మెసేజ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కింది.

మలయాళ కుట్టి నయనతార ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం "కర్తవ్యం". ఇది తమిళ చిత్రం "అరం"కు రీమేక్. మింజుర్ గోపి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కంప్లీట్ మెసేజ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కింది. నీటి కోసం తల్లాడే రైతుల వెన్నంటే నిలిచి వారి కష్ట నష్టాలలో భాగస్వామి‌గా నిలిచే కలెక్టర్ పాత్ర పోషించింది. 
 
ఈ మూవీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. 'కాకాముట్టై' ఫేం రమేష్, విఘ్నేష్, సును లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. 
 
ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన చిత్ర టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.