బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (13:06 IST)

'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటున్న హీరోయిన్ (Video)

హీరోయిన్ నయనతార ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ హీరో శింబు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది. శింబుతో బహిరంగ ముద్దులు ఇవ్వగా, ప్రభుదేవాతో కొద్ది రోజుల

హీరోయిన్ నయనతార ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ హీరో శింబు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది. శింబుతో బహిరంగ ముద్దులు ఇవ్వగా, ప్రభుదేవాతో కొద్ది రోజులు సహజీవనం కూడా చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
కొద్దిరోజులకు ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో ముచ్చటగా మూడో వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ వ్యక్తి తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్. ప్రస్తుతం అతనితో నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. 
 
అదేసమయంలో తమ ప్రేమకు గుర్తుగా ఎప్పటికప్పుడు వీరి ఫొటోలను నయన్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటూ ట్వీట్ చేసింది.