శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (18:13 IST)

విఘ్నేశ్‌తో త్వరలో పెళ్లి.. నయనతార పెళ్లి పీటలెక్కనుందా?

దక్షిణాది అగ్ర హీరోయిన్, లేడి సూపర్ స్టార్ అయిన నయనతార.. త్వరలో తన ప్రేమికుడిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ విఫలమైన తర్

దక్షిణాది అగ్ర హీరోయిన్, లేడి సూపర్ స్టార్ అయిన నయనతార.. త్వరలో తన ప్రేమికుడిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ విఫలమైన తర్వాత విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార.. పెళ్లి కూడా చేసేసుకుందని కోలీవుడ్ కోడైకూసింది.

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా టాక్ వచ్చింది. కానీ వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట చెన్నైలో కాపురం పెట్టనుందని కోలీవుడ్ వర్గాల తెలిసింది.
 
త్వరలోనే విఘ్నేశ్, నయనతార జంట పెళ్లిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ మధ్య విఘ్నేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నయన ఖరీదైన కారును అతనికి కానుకగా ఇచ్చిందని టాక్.

ఇప్పటికే కొచ్చిలోని ఓ చర్చిలో రహస్యంగా వీరికి వివాహం జరిగిందని ప్రచారం కూడా సాగింది. ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా.. విఘ్నేష్, నయనల వివాహం అట్టహాసంగా జరుగనుందని సన్నిహిత వర్గాల సమాచారం.