శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:59 IST)

పెళ్లి పీటలెక్కనున్న శ్రియా... వరుడు ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో ఆమెకు అవకాశాలు లేవు. దీంతో తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టింది. అదేసమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తుందనే విమ

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో ఆమెకు అవకాశాలు లేవు. దీంతో తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టింది. అదేసమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తుందనే విమర్శలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఇపుడు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా.. రష్యా యువకుడు. గత కొంతకాలంగా అతనితో శ్రియా చాలాచాలా సన్నిహితంగా ఉంటోంది. దీంతో వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా మార్చి నెలలో శ్రియ వివాహం జరగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
పెళ్లి విషయాన్ని అబ్బాయి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. రాజస్థాన్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.