సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (12:33 IST)

పెళ్లిళ్ల సీజన్ మొదలు.. మార్చి 3న 50 వేలకు మించిన వివాహాలు

పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు అన్నీ మంచి ముహూర్తాలే కావడంతో ఫంక్షన్ హాల్స్, షాపింగ్స్‌లతో బిజీబిజీ అయిపోయారు. మూడు నెలల తర్వాత వరుసగా ముహూర్తాలు వస్తున్నాయి. మార్చి 4న మం

పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు అన్నీ మంచి ముహూర్తాలే కావడంతో ఫంక్షన్ హాల్స్, షాపింగ్స్‌లతో బిజీబిజీ అయిపోయారు. మూడు నెలల తర్వాత వరుసగా ముహూర్తాలు వస్తున్నాయి. మార్చి 4న మంచి శుభ ముహూర్తం ఉండటం, ఆదివారం కలిసి రావడంతో చాలామంది జంటలు ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. 
 
ఈ ఒక్కరోజులోనే 450వేలకు మించిన వివాహాలు జరుగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయి. సిటీలోని ఫంక్షన్ హాల్స్ అన్నీ మార్చి 4, 8 తేదీల్లో బుకైపోయాయి. చాలామందికి హాల్స్ కూడా దొరకని పరిస్థితి. 
 
ఇక పురోహితులు కూడా దొరకడం కష్టమైపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పురోహితుల డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఫోటోగ్రాఫర్లు, క్యాటరింగ్ వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఇదే ఛాన్స్‌గా రేటును పెంచి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న ఖర్చులను సంపాదించుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్లు, క్యాటరింగ్ వాళ్ల కొరత తప్పట్లేదు.