శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:08 IST)

2019లోనే ''సాహో'' విడుదల.. పెళ్లి గురించి ప్రభాస్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 2019

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 2019లోనే సాహో విడుదల అవుతుందని టాక్. సుజీత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 
 
భారీ స్టంట్, యాక్షన్ సీన్స్ చిత్రీకరణకు విదేశాల్లో షెడ్యూల్ నిర్ణయించినట్లు సినీ యూనిట్ చెప్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా సీక్వెన్స్ వుంటాయని.. అందుకే ఈ సినిమా విడుదల 2019కి వాయిదా పడే ఛాన్సుందని టాక్. సాహో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో సాహో ద్వారా దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. ''సాహో'' సినిమాను ఒప్పుకోకపోతే.. ఓ మంచి చిత్రాన్నే కాదు.. ప్రభాస్ వంటి మంచి స్నేహితుడిని కోల్పోయేదాన్నని వెల్లడించింది. తాను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకడని తెలిపింది. తమ మధ్య కెరీర్ పరమైన అంశాలే చర్చకు వచ్చేవని చెప్పింది. 
 
ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయాలు తమ మధ్య చర్చకు రావని.. ఇందులో ప్రభాస్ పెళ్లి కూడా అంతేనని.. పెళ్లి అనేది పూర్తిగా ప్రభాస్ సొంత విషయమని.. ఇందుకు సమాధాం ప్రభాసే చెప్పగలడని వెల్లడించింది.