ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (15:43 IST)

సారంగదరియా నుంచి చిత్ర పాడిన ఇన్‌స్పిరేషనల్ సాంగ్ ‘అందుకోవా..’

Raja Ravindra, Shiva Chandu
Raja Ravindra, Shiva Chandu
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం మేకర్స్ ‘అందుకోవా...’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. విలక్షణ నటుడు, హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా పాట విడుదలైంది. సాంగ్‌ను విడుదల చేసిన నవీన్ చంద్ర ‘సారంగదరియా’ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 
 
‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. పాటను లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర ఆలపించారు. ఇదొక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా పాట ఉంది. రాంబాబు గోశాల పాటను రాశారు. ఈ సందర్భంగా...
 
చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘ మా ‘సారంగదరియా’ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.లెజెండ్రీ సింగర్ చిత్రగారు మా పాటను పాడటం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.  
 
డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘‘‘సారంగదరియా’ మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మా మూవీ నుంచి చిత్రగారు పాడిన ‘అందుకోవా..’ పాటను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పాటను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రగారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.
 
నటీనటులు రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు