Karthi: ఏజెంట్ బోస్ గా కార్తీ నటించిన సర్దార్ 2 అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల
Sardhar 2 trailer
ట్రైలర్ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, సామ్ సి.ఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌జే సూర్య నెగెటివ్ రోల్‌లో నటించగా, మాళవిక మోహనన్, రజిషా విజయ్, ఆషికా రంగనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
ఇందులో కార్తీ తండ్రీకొడుకులుగా కార్తీ నటించాడు. మాళవిక మోహనన్ ఏజెంట్ గా పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించగా.. కార్తీ భార్యగా రజిషా విజయ్ నటించారు. కొడుకు పాత్రకు జోడీగా ఆషికా రంగనాథ్ కనిపించనుంది ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
