శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (13:22 IST)

కీర్తిలో మా అమ్మను చూశాను.. "మహానటి"పై సావిత్రి కుమార్తె కామెంట్స్

అలనాటి సీనియర్ నేటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్ర పాత్రను కీర్తి సురేష్ పోషించ

అలనాటి సీనియర్ నేటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్ర పాత్రను కీర్తి సురేష్ పోషించగా, జెమిని గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించారు. అలాగే, ఈ చిత్రంలోని మిగిలిన పాత్రను అనేక మంది ప్రముఖ నటీనటులు పోషించారు.
 
బుధవారం విడుదలైన ఈ చిత్రాన్ని అనేక సినీ ప్రముఖులు వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, సావిత్ర అల్లుడు గోవింద్ కూడా ఈ చిత్రాన్ని గురువారం చూశారు. ఆ తర్వాత వారు తమ స్పందనను తెలియజేశారు. 
 
ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే, చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూశానని చెప్పారు. తన పాత్ర కోసం కీర్తి సురేష్‌ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోందన్నారు. అమ్మ కథను తెరకెక్కించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ, సావిత్రిని మించిన నటి లేదని అందరూ అంటుంటారని, కానీ తాను మాత్రం సావిత్రిని మించిన నటి రావాలని అంటుండేవాడినని తెలిపారు. 'మహానటి' చిత్రం ద్వారా తన కోరిక వాస్తవరూపం దాల్చిందని, సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించిందని తెలిపారు. సావిత్రి జీవిత చరిత్రతో సినిమా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.